వైయస్‌ఆర్‌సీపీ స్వీప్ చేస్తుందని ఎన్నికలు వాయిదా

స్థానిక సంస్థల ఎన్నికల్లో వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ స్వీప్‌ చేస్తుందన్న వార్త కొందరికి దుర్వార్తగా మారిందని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. ఇదే జరిగితే చంద్రబాబు రాజకీయంగా కనిపించకుండా పోతారని కొందరికి భయంగా ఉందన్నారు. కరోనా పేరుతో ఎన్నికలు వాయిదా వేయడం ఏంటని ఆయన ప్రశ్నించారు. నిష్పాక్షికంగా ఉండాల్సిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ విచక్షణ కోల్పోయారని అన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడే ఆయన సామాజిక వర్గానికి చెందిన రమేష్‌కుమార్‌ను ఎస్‌ఈసీగా నియమించారని గుర్తుచేశారు. ఒకవైపు కరోనా సాకుతో ఎన్నికలు వాయిదా వేశామని చెబతూనే.. మరోవైపు అధికారులను తప్పిస్తున్నారని మండిపడ్డారు.కరోనా ప్రపంచమంతా ఉందని, దీనివల్ల మరణాల శాతం తక్కువే అన్నారు. కరోనా వ్యాపించకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందన్నారు. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వమని, 151 ఎమ్మెల్యే స్థానాలు సాధించి వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం ఏర్పడిందన్నారు. సకాలంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోతే కేంద్రం నుంచి రావాల్సిన 14వ ఆర్థిక సంఘం నిధులు రావన్నారు. ఎన్నికల వాయిదాపై గవర్నర్‌కు ఫిర్యాదు చేసినట్లు సీఎం వెల్లడించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్ మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..సీఎం వైయస్‌ జగన్‌ మాటల్లోనే..
 కరోనా విషయంలో ఇంట్లోనే ఉంటూ రికవర్ కాబడ్డ కేసులు ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తున్నాయి. కేవలం 13.8% మాత్రమే హాస్పటలైజ్ అయిన కేసులు. 4.7 శాతం మాత్రమే ఐసీయులో ఉంచి వైద్యం అందిస్తున్న కేసులున్నాయి. ఇది రియాలిటీ. మన రాష్ట్రంలో దీనికి సంబంధించి ఏం చర్యలు తీసుకున్నామో ఒక ముఖ్యమంత్రిగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎవరికీ ఎలాంటి సమస్యా రాకూడదని తాపత్రయ పడుతున్నాం. మిడిలీస్ట్ కంట్రీస్ లో చిన్నచిన్న ఉద్యోగాలు చేస్తున్న వారు, లేబర్, సెంట్రిక్ పనులు చేసేవారు ఇక్కడ నుంచి చాలా మంది ఉన్నారు. ఆయా దేశాల నుంచి రాబోయే రోజుల్లో.. మరో నెలరోజుల్లో వాళ్లని వెనక్కి పంపబోతున్నారు. వారికి అక్కడ వైద్యం చేయించకుండా, మీ ప్రజలను మీరే చూసుకోమని తిరిగి పంపించబోతున్నారు. అప్పుడు కూడా మనం చేయాల్సిన ప్రాసెస్ చేస్తాం. ఆ దేశాల నుంచి వచ్చిన వారిని 14 రోజులు అబ్జర్వ్ లో ఉంచడం లేదా ఇళ్లలో ఐసొలేషన్ లో ఉంచడం, మానిటర్ చేయడం, వాళ్లకేదైనా జ్వరం లాంటివి వచ్చినా శ్రద్ధగా పట్టించుకోవడం, జిల్లా ఆసుపత్రుల్లో ఐసొలేటెడ్ వార్డుల్లో ఉంచి వైద్యం చేయడం సాధారణంగా జరిగిపోతుంది. చైనాలో ఈ వైరస్‌ సోకిన 81,000 మందిలో 65,000 మంది నయం అయిపోయి సాధారణ జీవితం గడుపుతున్నారు. 
ప్రజలు ఈ వైరస్‌ బారిన పడకుండా జాగ్రత్తలు పాటించడం అనేది నిరంతర ప్రక్రియ. పానికి బటన్ నొక్కి, రెండు వారాల తర్వాత అంతా న్యూట్రల్ అయిపోతుందని అనుకోలేం. ఇతర దేశాల్లో మెడికల్ బిల్స్ తట్టుకోలేక మనవాళ్లను వెనక్కి పంపుతూ ఉంటారు. వాళ్లని మనం చూసుకుంటూ ఉండాలి. ఇది నిరంతర ప్రక్రియ. మరో ఏడాది పాటు ఉండొచ్చు. నిరంతరంగా జరుగుతూ ఉంటుంది. వారికి చేయాల్సినవన్నీ చేస్తాం. 
మనమూ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పబ్లిక్ గేదరింగ్ లేకుండా చూసుకోవాలి. తప్పనిసరి అయితే తప్ప ప్రయాణాలు వాయిదా వేసుకోవడం. సినిమాలు, షాపింగ్ మాల్స్ కి తప్పనిసరి అయితేనే వెళ్లడం వంటివి మరో కొన్నాళ్లు కాదు ఇంకో ఏడాది వరకూ జరగాల్సిన, తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో భాగమే. ఈ నిజాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. బోర్డు ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి ఎగ్జామ్‌ హాల్లో మనిషికి మనిషికి మధ్యలో గ్యాప్‌ పెంచి పరీక్షలు నిర్వహిస్తాం. 
మనకి వచ్చిన ఒకే ఒక్క పాజిటివ్ కేసు ట్రీట్మెంట్ జరుగుతోంది. అత్యధిక శాతం మంది నయమై సాధారణ జీవితం గడుపుతున్నారు. దేశం మొత్తం మీద 51 లాబ్స్ ఉన్నాయి. మనకి తిరుపతిలో, విజయవాడలో లాబ్ లు ఉన్నాయి. కాకినడాలో మరో లాబ్ కోసం కూడా సెంట్రల్ గవర్నమెంట్ ను అడుగుతున్నాం. డిస్ట్రిక్ట్‌ హాస్పటల్స్ కి ఇలాంటి కేసులు ఏం వచ్చినా చూసుకునేలా సన్నద్ధం చేసాం. స్టాఫ్ కి ట్రైనింగ్ ఇవ్వడం, పర్సనల్ ప్రొటక్షన్ కేర్, ఎక్స్ ట్రా వెంటిలేటర్‌లు అందించడం వంటివన్నీ జరుగుతున్నాయి. వాలంటీర్లను ఉపయోగించి సర్వే కూడా చేసాం. ఒక యాప్ ద్వారా దానిపై మానిటర్ చూసాం. హెల్త్ డిపార్టుమెంట్ దాన్ని మానిటర్ చేసింది. ఇంటింటికీ దీనిపై అవగాహన కల్పించే ఏర్పాట్లూ చేశాం. అంతర్జాతీయ ఎయిర్పోర్టు ఒక్క విశాఖలోనే ఉండటం మనకు కలిసొచ్చిన అంశం. మనది చిన్న ప్రాంతమే కాబట్టి త్వరగా ఇలాంటి కేసులను గుర్తించగలం. దీనివల్ల ఎవరూ చనిపోయే పరిస్థితి రాకుండా ఉండేదుకు ప్రయత్నం చేస్తున్నాం. నెల్లూరులో ఒక్క పాజిటివ్ కేస్ కనిపించగానే దానికి 25 కిలోమీటర్ల పరిధిలోని వేలాది ఇళ్లను, ప్రతి ఇంటినీ కూడా టీమ్స్ ను పంపి సర్వే చేయించాం. 
చంద్రబాబు హయాంలో తన సామాజిక వర్గానికి చెందిన ఒక ఐఏఎస్ అధికారిని తన ఛాయిస్ తో స్టేట్ ఎలక్షన్ కమీషనర్ గా నియమించుకున్నారు. ఆయనే ఈ నిమ్మగడ్డ రమేష్ కుమార్. ఎలక్షన్ కమిషనర్ కు ఉండాల్సిన అర్హత నిష్పాక్షికత ఉండటం. ఈయన ఒకవైపు కరోనా వైరస్ వల్ల ఎలక్షన్ పోస్టు పోన్ చేస్తున్నాని చెప్పి, అదే ప్రెస్ మీట్ లో గుంటూరు, చిత్తురు జిల్లా కలెక్టర్లను , మాచర్ల సీఐను తప్పిస్తూ ప్రకటన చేస్తున్నారు. మీ విచక్షణ ప్రకారం బాగోని అధికారులను మార్చచ్చు. కానీ ఒకపక్క కరోనా కారణం చూపిస్తూ, మరో పక్క ఆ ప్రాంతంలో అధికారులను మార్చడం ఏమిటి? 
కలెక్టర్లకు నిన్న ఉత్తరం రాసాడు. అన్ని కార్యక్రమాలూ ఆపేయమన్నాడు. నిన్నటికీ ఇవాళ్టికీ తేడా ఏంటంటే అన్ని ప్రాంతాల్లో యునానిమస్ అవడం వాళ్లకు వచ్చిన వార్త. వైయస్సార్‌సీపి స్వీప్ చేస్తోందనే వార్త వాళ్లకు దుర్వార్తలా వినిపించింది. ఇది మాత్రమే నిన్నటికీ ఇవాళ్టికీ జరిగిన తేడా. దాన్ని తట్టుకోలేక, జీర్ణించుకోలేక, చంద్రబాబు ఇంకా దారుణమైన స్థాయికి పడిపోతున్నారని ప్రజలు ఎక్కడ అనుకుంటారో అని, ఏకంగా పొద్దున్నే 4పేజీల ఆర్డర్ పంపారు. ఆశ్చర్యం ఏమింటంటే ఈ ఆర్డర్ చేసినట్టు ఎలక్షన్ కమిషన్ లో ఉన్న సెక్రటిరీకే తెలీదు. ఎవడో రాస్తున్నాడు.. ఇంకెవడో ఆర్డర్ ఇస్తున్నాడు, ఈయన అది చదివి వినిపిస్తున్నారు.  ఇది రైటేనా... ధర్మమేనా? ఒకవైపున ఆర్డర్ ఇస్తారు. ఎలక్షన్లు లేవు పోస్టు పోన్ అవుతున్నాయని, మరోవైపు కలెక్టర్లను, ఎస్పీలను, అధికారులను ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఆపేయమని ఆర్డర్లు ఇస్తున్నారు. ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే కరోనా కారణం చూపించి ఎలక్షన్లు పోస్టు పోన్ చేస్తున్నానని ప్రెస్ మీట్ పెట్టి ఆర్డర్ ఇచ్చాడు. నువు పోస్టు పోన్ చేసినప్పుడు, ఎవరినైనా అడగాలి కదా.. సూచనలు సలహాలు తీసుకోవాలి. పక్కనే హెల్త్ సెక్రటరీ ఉన్నారు. వారిని అడగడమో, రివ్యూ చేయడమో చేసిన పాపాన పోలేదు. చీఫ్ సెక్రటరీని అడగలేదు. రాష్ట్రంలో ఏం జరుగుతోంది, ఎన్ని కేసులున్నాయి, అనే వివరాలు మాట్లాడటమో, అడగటమో లేదు. సలహాకూడా తీసుకోడం లేదు. కానీ ఆర్డర్ కాపీలో మాత్రం స్టేట్ ఎలక్షన్ కమీషన్ సీనియర్ హెల్త్... సీనియర్ పంక్షనరీస్‌తో మాట్లాడి సూచనలు తీసుకున్నాం అంటారు. హెల్త్ సెక్రటరీ కంటే సీనియర్‌ ఫంక్షనరీస్‌ ఉంటారా? డెమోక్రసీలో ఇది కరెక్ట్ పద్ధతేనా. చంద్రబాబే ఆయనకు పోస్టు ఇచ్చుండచ్చు. ఆయనది చంద్రబాబుది ఒకే సామాజిక వర్గం కావచ్చు. అయినా సరే ఇలా చేయడం ధర్మమేనా. ఇలాంటి వివక్ష చూపడం న్యాయమా? చంద్రబాబు తనకి చెందిన ఎల్లో పత్రికలు, టీవీ ఛానెళ్ల ఆసరాతో ఈ ఎలక్షన్లకు సంబంధించి నానా యాగీ చేస్తున్నాడు. రాష్ట్రంలో 10,243 ఎంపీటీసీలు, జడ్పీటీసీలు జరిగితే..54,594 నామినేషన్లు అన్ని పార్టీల వాళ్లూ వేస్తే కేవలం చెదురు మదురు జరిగిన ఘటనలు 43.  2794 వార్డులు డివిజన్లలో పోటీ జరుగుతుంటే 15185 నామినేషన్లు పడ్డాయి. వీటిలో 14 చోట్ల చెదురుమదురు ఘటనలు జరిగాయి. లోకల్ బాడీల్లో ఈ మేరకు జరగకుండా ఎక్కడైనా ఉందా? ఇంత తక్కువ ఎప్పుడైనా జరిగాయా? ఇంతకంటే ఎక్కువ అల్లర్లే జరగలేదా?ఇదంతా విష ప్రచారం, రాక్షసక్రీడకు పాల్పడటం కాదా? మీకు చానెళ్లు, పేపర్లు నాలుగు ఎక్కువ ఉన్నాయి అని ఇంత దారుణానికి పాల్పడటం కరెక్టేనా? మా పోలీసుల గురించి గర్వంగా చెబుతాఅటెమ్టివ్ మర్డర్ కేసులు కూడా నమోదులు చేశారు. ప్రేక్షకపాత్ర వహించలా. ఎవరినీ ఉపేక్షించలా. వారు వారి డ్యూటీ సిన్సియర్ గా చేసారు. యునానమస్ గురించి మాట్లాడితే..ఇంతకుముందు2013 లో లోకల్ బాడీ ఎలక్షన్లో ఈనాడు పేపర్లో...mptc ల్లో tdp సత్తా చాటింది. 13 జిల్లాల్లో 270 స్థానాలు వైకాపా దక్కించుకుంది. ఏపీలో ఘోరంగా దెబ్బతిని కాంగ్రెస్ 6 కు పరిమితమైంది అని రాశారు. అంటే ఏకగ్రీవం కావడం కొత్తేం కాదు. పార్టీ గాలి 151 స్థానాల్లో గెలిచింది 9 నెలల్లో ప్రజలు హర్షించదగ్గ మేలుచేసే పాలన ఇచ్చాం. మేనిఫెస్టోలో చెప్పినవి దాదాపుగా 90% ప్రతి పనీ కార్యరూపం దాల్చేలా చర్యలు తీసుకున్నాం. ప్రజలకు ఇష్టమైన, మెచ్చుకునే పాలన తెచ్చాం. ఇలాంటప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేస్తే చంద్రబాబు ఎందుకు తట్టుకోలేకపోతున్నాడు? ఎలక్షన్ కమీషన్ ఎందుకు దయనీయ పరిస్థితిని తెచ్చాడు. వ్యవస్థల్లో తనకున్న మోల్సును ఉపయోగించి, వాటిని దిగజారుస్తున్నాడు చంద్రబాబు. ఎన్నికల ప్రక్రియ జరగడం ఎందుకింత అవసరమో ఆలోచన చేయండి. మార్చి 31లోపు ఎన్నికలు అయితే, 14వ ఆర్థిక కమీషన్ నిధులు దాదాపుగా 5000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి వస్తాయి. ఎన్నికలు జరక్కపోతే ఆ డబ్బులు రావు. వాటినెందుకు పోగొట్టుకోవాలి. అవొస్తే వాటిని రాష్ట్రంలో ఏదో ఒకదానికి ఉపయోగించుకుంటాం కదా. కేవలం చంద్రబాబు ముఖ్యమంత్రి గా ఎన్నిక కాలేదనే కోపంతో ఎన్నికలు పోస్ట్ పోన్ చేస్తున్నారు. దీనివల్ల పరిస్థితి మెరుగౌతుందా? ఆ దేశస్తులను మాత్రం స్వదేశాలకు పంపించడం మొదలౌతుంది. అదే జరిగితే...పరిస్థితి ఇంకా ఎక్కువౌతుంది కానీ తగ్గదు కదా. ఎలక్షన్లు దీన్ని అడ్డుపెట్టుకుని ఆపడం వల్ల ఏం లాభం. ఒకపక్క కరోనాపై పోరాడుతూ మన పని మనం చేసుకుంటూ పోవాలి. మన నిధులు రావడం క్వశ్చన్ మార్కు పడింది. వచ్చే ఏడాది కూడా ఇదే పరిస్థితి వస్తే, ఎన్నికలు ఆగిపోతే మరో 5000 కోట్లు ఆగిపోవడమేనా. బాధ్యతగల స్థానంలో ఉన్న వ్యక్తులు దీన్ని ఆలోచించద్దా. ఎన్నికలు ఒక ప్రక్రియ ప్రజాస్వామ్యంలో. వాటిని పూర్తి చేస్తే అభివృద్ధి ముందడుగు వేస్తుంది. అది జరగకూడదు, మేం అధికారం చెలాయించాలని కోరుకుంటూ, సంక్షేమ కార్యక్రమాలు ఆపేయించి ఎవరు అన్యాయం చేస్తున్నారు? ప్రజలకు మంచి చేస్తున్నారా కీడు చేస్తున్నారా? ఇది ఇలాగే చూస్తూ ఊరుకోం. దీనిపై గవర్నర్  కి కంప్లైంట్ చేసాం. ఆయనలో మార్పు రావాలని ఆశిస్తున్నాం. దీన్ని పై స్థానంలోకి తీసుకుపోయి ఈ మనుషులు చేస్తున్న పనులను ఎక్స్ పోజ్ చేయబోతున్నాం.

No comments

Powered by Blogger.