Sharwanand Marriage News సైలెంట్ గా నిశ్చితార్థం చేసేసుకున్న శర్వానంద్
టాలీవుడ్ హీరోలలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో ఒకరు శర్వానంద్. వైవిధ్యమైన కథలతో మెప్పిస్తూ క్యారెక్టర్ ఆర్టిస్ట్, సైడ్ హీరో నుంచి హీరోగా ఎదిగిన శర్వానంద్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇటీవలే ఒకేఒక జీవితం అనే సినిమాతో మంచి విజయం సాధించాడు. గత కొన్ని రోజుల నుంచి శర్వానంద్ పెళ్లి వార్తలు వినిపిస్తున్నా దానిపై శర్వా అధికారికంగా స్పందించలేదు.
తాజాగా రిపబ్లిక్ డే జనవరి 26న శర్వానంద్ తన నిశ్చితార్థం ఫోటోలని షేర్ చేసి అందరికి సర్ ప్రైజ్ ఇచ్చాడు. అతి తక్కువ మంది మధ్యలో, కేవలం కుటుంబ సభ్యులు, ఆత్మీయ అతిధులు, శర్వా సన్నిహితుల మధ్య హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హోటల్ లో శర్వానంద్ నిశ్చితార్థం చేసుకున్నాడు. రక్షిత అనే సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ని శర్వా నిశ్చితార్థం చేసుకున్నాడు. రక్షిత ప్రస్తుతం అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా వర్క్ చేస్తుందని సమాచారం. అయితే వీరిద్దరిది లవ్ మ్యారేజినా లేక పెద్దలు కుదిర్చిన వివాహమా అనేది ఇంకా తెలియలేదు. త్వరలోనే వీరిద్దరూ వివాహం చేసుకోనున్నారు. ఈ వేడుకలో శర్వా బెస్ట్ ఫ్రెండ్స్ లో ఒకరైన స్టార్ హీరో రామ చరణ్ కూడా ఉపాసనతో కలిసి పాల్గొన్నాడు.
Post a Comment